తెలంగాణ ఇంటర్ పరీక్షల 2027 షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురుచూస్తున్న 2027 వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఈ పరీక్షల ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు రాత పరీక్షలు జరగనున్నాయి.
Karnataka-SSLC-PUC-Exam-System-Two-Main-Exams-2027


హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురుచూస్తున్న 2027 వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఈ పరీక్షల ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు రాత పరీక్షలు జరగనున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24 నుంచి, సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

వార్షిక పరీక్షలకు ముందుగా ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ను కూడా బోర్డు ప్రకటించింది. సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 18వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.

ఇక జనవరి 27న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష, జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల తేదీలు ఖరారు కావడంతో విద్యార్థులు ఇప్పటి నుంచే సన్నద్ధతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సిలబస్ను సకాలంలో పూర్తిచేసుకుని, పునశ్చరణకు తగిన సమయం కేటాయించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన ఇతర మార్గదర్శకాలను ఇంటర్ బోర్డు వెల్లడించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande