చుక్కా రామయ్యకు 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్రెడ్డి
ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందిన చుక్కా రామయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
CM Revanth Reddy


హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందిన చుక్కా రామయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య వందో పుట్టినరోజు సందర్భంగా సీఎం స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు.

హైదరాబాద్లోని విద్యానగర్లో ఉన్న చుక్కా రామయ్య ఇంటికి రేవంత్రెడ్డి చేరుకుని ఆయనను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా శత వసంతాలు పూర్తి చేసుకున్న ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

విద్యారంగంలో చుక్కా రామయ్య చేసిన సేవలు ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా గణిత బోధనలో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలనే లక్ష్యంతో చదివే విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande