పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నేడు సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)

తెలంగాణలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేడు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

పురపాలక శాఖ పరిధిలో చేపట్టిన రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల పురోగతిని సీఎం పరిశీలించనున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

అలాగే నగరాల విస్తరణ, పట్టణ ప్రణాళిక, చెరువుల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రారంభించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించే అవకాశం ఉంది. నిధుల వినియోగం, పెండింగ్ ప్రాజెక్టుల స్థితిగతులపైనా సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో వెలువడే నిర్ణయాలు రాష్ట్రంలోని పట్టణాభివృద్ధికి కీలకంగా మారనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande