
నిర్మల్, 20 నవంబర్ (హి.స.)
తెలంగాణలో పెద్ద దుమారం రేపిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ధాన్యం అక్రమాల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వేగం పెంచింది. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు చెందిన నివాసాలు, ఆస్తులపై శుక్రవారం తెల్లవారుజామున ఈడీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు.
ఉదయం 6 గంటలకే రంగంలోకి దిగిన ఈడీ బృందాలు ఖానాపూర్ పట్టణంలోని ఆమె ఇంటితో పాటు మరో చోట కూడా ఒకేసారి తనిఖీలు చేపట్టాయి. సోదాల నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా రేఖానాయక్ ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. మీడియా ప్రతినిధులు, అనుచరులు లోపలికి వెళ్లకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈడీ అధికారుల హఠాత్ దాడులతో ఖానాపూర్‌లో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు