హెచ్సీయూలో ఫుడ్ పాయిజన్.. 31 మంది విద్యార్థులకు అస్వస్థత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. క్యాంపస్లో భోజనం చేసిన విద్యార్థుల్లో 31 మంది అస్వస్థతకు గురయ్యారు.
హెచ్సీయూలో ఫుడ్ పాయిజన్.. 31 మంది విద్యార్థులకు అస్వస్థత


హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. క్యాంపస్లో భోజనం చేసిన విద్యార్థుల్లో 31 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన నెలకొంది. వెంటనే స్పందించిన అధికారులు బాధితులను క్యాంపస్లోని హెల్త్ సెంటర్కు తరలించి వైద్య చికిత్స అందించారు.

యూనివర్సిటీలోని క్యాంటీన్లలో సుమారు 400 మంది విద్యార్థులు భోజనం చేసినట్లు సమాచారం. అయితే భోజనం చేసిన వారిలో 31 మందికి ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించడంతో వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బాధితులకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

ఈ ఘటనతో క్యాంపస్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఫుడ్ పాయిజన్కు అసలు కారణం ఏమిటనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande