రాజన్న ఆలయంకు ఎలాంటి భంగం రాకుండా అభివృద్ధి పనులు.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న ఆలయ అభివృద్ధి కోసం అవసరమైతే పది అడుగులు వెనక్కి తగ్గడానికైనా సిద్ధమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Aadi srinivas


వేములవాడ, 20 నవంబర్ (హి.స.)

రాజన్న ఆలయ అభివృద్ధి కోసం అవసరమైతే పది అడుగులు వెనక్కి తగ్గడానికైనా సిద్ధమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. తమకు వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే ఆలయ అభివృద్ధి, భక్తుల మనోభావాలే ముఖ్యమని ఆయన అన్నారు.

వేములవాడలో శుక్రవారం మాట్లాడిన ఆయన.. ఆలయ విస్తరణ పనులన్నీ శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి, శ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారి అనుమతులు, సూచనల ప్రకారమే, ఆగమ శాస్త్ర నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలిపారు.

రాజన్న ఆలయ ప్రాచీనతకు, విశిష్టతకు, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు ఎలాంటి భంగం రాకుండా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఆలయ అభివృద్ధిలో వ్యక్తిగత నిర్ణయాలకు చోటు లేదని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆగమ, శిల్పశాస్త్ర నిపుణులు, ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారుల సమన్వయంతోనే పనులు సాగుతున్నాయని వివరించారు.

కొత్త పంచతల విమాన గోపుర నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతుల నుంచి 2026 ఆగస్టు 12న శ్రీముఖం వచ్చిందని ఆయన వెల్లడించారు. నవంబర్ 1న మంచి ముహూర్తంలో శాస్త్రోక్తంగా కళాపకర్షణ, కలశ సంబంధిత పూజలు చేసిన తర్వాతే పనులు మొదలుపెట్టామని తెలిపారు. నవంబర్ 16న ప్రధాన ఆలయ శిఖరంపై ఉన్న కలశాన్ని శృంగేరి జగద్గురువుల సూచన మేరకు గర్భాలయంలో ధాన్యాధివాసం చేసి, నిత్య కైంకర్యాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande