
సూర్యాపేట , 20 నవంబర్ (హి.స.)
సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. మృతుడిని చామకూరి మహేశ్‌గా పోలీసులు గుర్తించారు.
స్థానికంగా అందిన సమాచారం ప్రకారం.. మహేశ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు? హత్యకు గల కారణాలేమిటి? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తిగత కక్షలే కారణమా? లేక ఇతర వివాదాల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో విచారణ జరిపే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్