అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు క్షమించరు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఉన్నత స్థానాల్లో ఉన్న నేతలు మాట, చేతల్లో హుందాతనం పాటించాలని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. అధికారం చేతిలో ఉందని అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు అస్సలు హర్షించరని ఆయన వ్యాఖ్యానించారు.
Mla


హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)

ఉన్నత స్థానాల్లో ఉన్న నేతలు మాట, చేతల్లో హుందాతనం పాటించాలని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. అధికారం చేతిలో ఉందని అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు అస్సలు హర్షించరని ఆయన వ్యాఖ్యానించారు.

తన ఎక్స్ ఖాతాలో రాజగోపాల్ రెడ్డి కీలక పోస్ట్ పెట్టారు. అదృష్టం వల్ల వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ, ప్రజల అవసరాలను పక్కన పెట్టి పాలన సాగిస్తే దానిని తెలంగాణ ప్రజలు గానీ, చరిత్ర గానీ ఎప్పటికీ క్షమించదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ధర్మబద్ధంగా, నిజాయితీగా పాలించేలా ముఖ్య నేతలకు మంచి బుద్ధి, ఆత్మవిమర్శ చేసుకునే జ్ఞానం ఇవ్వాలని పోస్టులో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande