ఈనెల 23న కరీంనగర్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈనెల 23న కరీంనగర్లో పర్యటించనున్నారు. నగరంలో నిర్వహించనున్న మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు.
Notin nabin


హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈనెల 23న కరీంనగర్లో పర్యటించనున్నారు. నగరంలో నిర్వహించనున్న మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని పాతరేద్దాం’ అనే నినాదంతో ఈ మహా పాదయాత్రను నిర్వహించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజకీయ పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ పాదయాత్రలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు రామచంద్రరావు, బండి సంజయ్తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ కూడా పాల్గొననున్నారు. జాతీయ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో కరీంనగర్లో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చేలా నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande