
పెద్దపల్లి, 20 నవంబర్ (హి.స.)
జిల్లాలోని యువతకు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టాస్క్ కేంద్రాన్ని, ఎద్దపల్లి పట్టణంలోని పదో వార్డు రంగంపల్లిలో ఉన్న బస్తీ దవాఖానాను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, టాస్క్ కేంద్రం ద్వారా ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ కోర్సులను యువతకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా అవసరమైన నైపుణ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా శిక్షణ కోర్సులను రూపొందించి అమలు చేయాలని తెలిపారు. కేవలం శిక్షణ ఇవ్వడానికే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి కల్పించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. టాస్క్ కేంద్రం ద్వారా మరింత మంది యువతకు ప్రయోజనం కలిగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు