సీఎం చంద్రబాబుతో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి భేటీ
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలిశారు. తన వెంట కడప జెడ్పీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న బీజేపీ నేత చదిపిరాళ్ల రాజేశ్రెడ్డిని కూడా తీసుకెళ్లారు.
Chandrababu Naidu


అమరావతి , 21 నవంబర్ (హి.స.)అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలిశారు. తన వెంట కడప జెడ్పీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న బీజేపీ నేత చదిపిరాళ్ల రాజేశ్రెడ్డిని కూడా తీసుకెళ్లారు. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని రాజేశ్రెడ్డికి కేటాయించాలని ఆదినారాయణరెడ్డి ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. అయితే కూటమిలో సీట్ల పంపకాల కారణంగా కడప జెడ్పీ ఛైర్మన్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడం సాధ్యం కాలేదని చంద్రబాబు వివరించారు.

కూటమి పార్టీల మధ్య ముందుగా కుదిరిన అవగాహన, సీట్ల సర్దుబాటును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డితో చంద్రబాబు మాట్లాడి పరిస్థితిని వివరించారు. బీజేపీ నేతల అభ్యర్థనను విన్న ముఖ్యమంత్రి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి విషయంలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఈ భేటీ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande