లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్యా చవాన్ లాల్ రూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
Acb


కరీంనగర్, 21 నవంబర్ (హి.స.)

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి లావుడ్యా చవాన్ లాల్ రూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.

ఫిర్యాదుదారుని కోడలికి టీజీ చేయూత పెన్షన్ - వితంతు పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి, పెన్షన్ మంజూరు చేయించినందుకు బహుమతిగా ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ కరీంనగర్ రేంజ్ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదుదారుని నివాసంలోనే నిందితుడు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుండి రూ.10,000 లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, అక్రమ ప్రయోజనం కోసం ప్రజా విధులను అక్రమంగా, నిజాయితీ లేకుండా నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.

నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్లో ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు ముందు జ్యుడీషియల్ రిమాండ్ కోసం హాజరు పరుచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలు వెల్లడించడం లేదని ఆయన అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande