
నిర్మల్, 21 నవంబర్ (హి.స.)
నిర్మల్ పట్టణంలోని గొల్లపేట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా శిబిరాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బీమా నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఒక కుటుంబానికి బీమా నమోదు చేయడానికి ఎంత సమయం పడుతుందో స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. స్థానిక అధికారులు శిబిరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలందరూ ఈ పథకం కింద నమోదయ్యేలా చొరవ చూపాలని తెలిపారు. పథకంపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి, వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు