
హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు చెన్నైలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించనున్న కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ వివాహ రిసెప్షన్ వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం.
కావ్య మారన్, అనిరుధ్ల వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం అందుకున్న రేవంత్‌రెడ్డి, వేడుకలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ పర్యటన వ్యక్తిగత కార్యక్రమానికి సంబంధించినదిగా తెలుస్తోంది. చెన్నైలో రిసెప్షన్ వేడుక ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు.
అనుకున్న షెడ్యూల్ ప్రకారం నేడు రాత్రికి ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రయాణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చెన్నై పర్యటన స్వల్ప వ్యవధిలోనే ముగియనుండటంతో రాత్రికే ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్