
హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో గంజాయి విక్రయాల వ్యవహారం కలకలం రేపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ డెలివరీ బాయ్ గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా నిందితుడి గంజాయి విక్రయాల విషయం వెలుగులోకి వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని పరిశీలించగా మొత్తం 1,089 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు తెలిసింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
విచారణలో నిందితుడు ఒడిశా నుంచి గంజాయిని హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు సమాచారం. డెలివరీ ఉద్యోగం ముసుగులో ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? నగరంలో ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. నగరంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా మరింత పెంచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్