గురునానక్ దేవ్ జీ 557వ జయంతి.....నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు
గురునానక్ దేవ్ జీ 557వ జయంతి వేడుకల సందర్భంగా నేడు పాతబస్తీలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, రూట్ మళ్లింపులు అమలు చేయనున్నారు.
ట్రాఫిక్


హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)

గురునానక్ దేవ్ జీ 557వ జయంతి వేడుకల సందర్భంగా నేడు పాతబస్తీలో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, రూట్ మళ్లింపులు అమలు చేయనున్నారు.

ఊరేగింపు సాగే మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనుండటంతో వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

అశోక్ బజార్ గురుద్వారా నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు అఫ్జల్గంజ్ టీ జంక్షన్, ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి, గౌలిగూడ చమన్, శంకర్ షేర్ హోటల్ మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకోనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు అవసరాన్ని బట్టి వాహనాలను ఇతర రూట్లలోకి మళ్లించనున్నారు.

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande