రేవంత్ వ్యాఖ్యలకు కిషన్రెడ్డి ఘాటు కౌంటర్.. తెలంగాణలో బీజేపీదే తదుపరి అధికారం
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్రెడ్డి గట్టి సమాధానమిచ్చారు.
Kishan Reddy


హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్రెడ్డి గట్టి సమాధానమిచ్చారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకుందని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించిందని పేర్కొన్నారు. రాబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా తమ పార్టీ ఖాతాలోనే పడతాయని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కిషన్రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలన, రాజకీయ వైఖరితో ప్రజలు విసిగిపోయారని, భవిష్యత్తులో వాటికి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు నిజమైన మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పార్టీ బలాన్ని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. తెలంగాణలో ఇక బీజేపీ ఆట మొదలవుతుందని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande