ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
కుల, మత, ఆదాయ భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు.
Mla


ఖమ్మం, 21 నవంబర్ (హి.స.)

కుల, మత, ఆదాయ భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు.

ప్రజల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

శనివారం సత్తుపల్లి పట్టణంలోని 14వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం అందనుందని వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande