మహబూబాబాద్ జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్
మహబూబాబాద్ జిల్లాలో శనివారం ఉదయం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
Police


మహబూబాబాద్, 21 నవంబర్ (హి.స.)

మహబూబాబాద్ జిల్లాలో శనివారం ఉదయం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

కేసముద్రం మండల పరిధిలోని చెరువుముందు తండా, బోడమాచ తండాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సర్కిల్ సిబ్బంది కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న, నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల్లో 4,000 లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు. 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో 50 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి వాటి రికార్డులు, ధ్రువపత్రాలను పరిశీలించారు.

అనంతరం తండావాసులకు గంజాయి వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధం తదితర అంశాలపై పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande