జనగామలో విషాదం.. భర్త మృతి తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య మృతి
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మునిసిపాలిటీ పరిధి చాగల్లులో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. భర్త మృతిని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కూడా మృతి చెందింది.
Sad


జనగామ, 21 నవంబర్ (హి.స.)

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మునిసిపాలిటీ పరిధి చాగల్లులో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. భర్త మృతిని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య కూడా మృతి చెందింది.

చాగల్లుకి చెందిన వడ్లకొండ లోకనాథం (84), వడ్లకొండ రామక్క (75) దంపతులు. రామక్కకు ప్రమాదం జరగడంతో కాలుకు రాడ్ వేశారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చింది. భార్య అనారోగ్య పరిస్థితి పట్ల ఆందోళన చెందుతున్న లోకనాథం శుక్రవారం రాత్రి సుమారు 9.50 గంటల ప్రాంతంలో మృతి చెందారు. భర్త మరణంతో రామక్క తీవ్ర మనోవేదనకు గురై కన్నీరుమున్నీరుగా విలపించింది. భర్త చనిపోయాడన్న బాధతో శనివారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటల ప్రాంతంలో ఆమె కూడా మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande