తెలంగాణలో పెరుగుతున్న చలి పంజా.. తొలిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి ఇబ్బందులు పడుతున్నారు.
Dense fog


హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు చలికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో తొలిసారిగా పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరడం గమనార్హం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

సంగారెడ్డి జిల్లాలోని సత్వార్లో అత్యల్పంగా 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్లో 9.7 డిగ్రీలు రికార్డు కాగా, న్యాల్కల్, ఝరాసంగం ప్రాంతాల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని డోంగ్లిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్, ధారూర్ ప్రాంతాల్లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఉదయం వేళల్లో పొగమంచు, చల్లని గాలుల ప్రభావం కూడా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లేవారు వెచ్చని దుస్తులు ధరించడం మంచిది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande