రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.. సీఎం రేవంత్ రెడ్డి.
భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పటిష్టమైన పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Cm


హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)

భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పటిష్టమైన పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగం పౌరుల హక్కులను కాపాడటంతో పాటు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే భారత రాజ్యాంగం ప్రతి పౌరుడి గౌరవం, హక్కులు, అవకాశాలకు భరోసా కల్పిస్తుందని గుర్తుచేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande