
హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సందీప్‌కుమార్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్ వద్ద ఉన్న అతిథి గృహంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ సంస్థాగత అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెంపొందించడం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే సందీప్‌కుమార్ రాష్ట్రంలోని పలువురు ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించారు. మంత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, పీసీసీ అనుబంధ విభాగాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ పరిస్థితులు, నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి సమస్యలపై వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో జరుగుతున్న భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్