అచ్చంపేటలో సభాస్థలికి పాదయాత్రగా సీఎం రేవంత్రెడ్డి
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన కొనసాగుతోంది.
Telangana CM Revanth Reddy


అచ్చంపేట , 26 నవంబర్ (హి.స.)

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సీఎం సభాస్థలికి పాదయాత్రగా బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయనకు స్థానికులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం రేవంత్రెడ్డి సైతం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయనను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలు సీఎం వెంట నడుస్తూ సందడి చేశారు. పాదయాత్ర సాగిన మార్గంలో ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలకడంతో అచ్చంపేటలో సందడి నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా కనిపించాయి. సభాస్థలికి చేరుకున్న అనంతరం రేవంత్రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande