అచ్చంపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: సీఎం రేవంత్ రెడ్డి
అచ్చంపేట ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
Revanth Reddy


అమరావతి , 26 నవంబర్ (హి.స.)అచ్చంపేట ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అచ్చంపేట బిడ్డగా ఈ ప్రాంతానికి చేయాల్సిన అభివృద్ధి పనులన్నీ చేపడతానని స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా పొదుపు సంఘాల మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, ఆసరా పింఛన్ల పంపిణీని కూడా ప్రారంభించారు. మహిళల సంక్షేమం, పేదల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వీరమాంబ అచ్చమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తున్న గొప్ప చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని కొనియాడారు. అచ్చంపేట ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు.

అనంతరం రాజకీయ అంశాలపై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు చేశారు. గతంలో చేసిన తప్పుల కారణంగా ప్రజలకు ముఖం చూపించలేకే కేసీఆర్ బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్పే రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande