సైబరాబాద్ మూవ్స్-2026 సదస్సును ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్లోని టీహబ్ వేదికగా నిర్వహిస్తున్న ‘సైబరాబాద్ మూవ్స్-2026’ సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
DGP cv anand


హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని టీహబ్ వేదికగా నిర్వహిస్తున్న ‘సైబరాబాద్ మూవ్స్-2026’ సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో సైబరాబాద్ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించనున్నారు. అలాగే నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజలను సామూహిక రవాణా వైపు ప్రోత్సహించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంసీ కమిషనర్ సృజన, పోలీస్ కమిషనర్ రమేష్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సైబరాబాద్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ట్రాఫిక్ రద్దీ తీవ్ర సమస్యగా మారుతోంది. ముఖ్యంగా కార్యాలయాలు, ఐటీ సంస్థలు ఉన్న ప్రాంతాల్లో రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఆధునిక రవాణా విధానాలు, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించే మార్గాలపై నిపుణులు చర్చించనున్నారు. ఈ సదస్సులో వెలువడే సూచనలు భవిష్యత్తులో సైబరాబాద్ రవాణా వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande