
సిద్దిపేట, 26 నవంబర్ (హి.స.)
సిద్దిపేట జిల్లా వర్గల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లో రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ కంపెనీ నూతన ప్లాంట్ కు గురువారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు భూమిపూజ చేశారు.
ఫ్రీజ్ డ్రైడ్ ఇన్ స్టంట్ కాఫీ తయారీ కోసం రెండు దశల్లో నిర్మించనున్న ఈ ప్లాంట్ ద్వారా 1,000 మందికి కొత్తగా ఉపాధి లభించనుంది. తొలి దశలో ఏటా 5,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాసియాలోనే తొలిసారిగా అత్యాధునిక రోటో టెక్నాలజీతో ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు.
2027 చివరి నాటికి రెండో దశ విస్తరణ పూర్తయితే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 11,000 మెట్రిక్ టన్నులకు చేరుకోనుంది. ఈ యూనిట్ 100 శాతం ఎగుమతుల ఆధారంగా పనిచేయనుంది. ఇక్కడ తయారయ్యే ఇన్ స్టంట్ కాఫీని యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా తదితర దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారుతోందని అన్నారు. వర్గల్ లో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ తో మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ కు మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..