విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. ఎమ్మెల్యే విజయరమణ రావు
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు సూచించారు.
Mla


పెద్దపల్లి, 26 నవంబర్ (హి.స.)

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు సూచించారు. చదువుతో పాటు పౌష్టికాహారం అందితేనే పిల్లలు చురుగ్గా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

గురువారం ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీని ఆయన లాంఛనంగా మొదలుపెట్టారు. హరే రామ హరే కృష్ణ ట్రస్టు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో పిల్లలతో కలిసి కూర్చుని ఆయన కూడా అల్పాహారం తీసుకున్నారు.

ఆ తర్వాత మాట్లాడిన విజయరమణ రావు, ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు చదువులో ముందుండగలరని, అప్పుడే భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోగలరని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల బాగోగులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పిల్లల ఆరోగ్యం, చదువు కోసం ముందుకొచ్చి అల్పాహారం అందిస్తున్న ట్రస్టు నిర్వాహకులను ఆయన మెచ్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande