
ఖమ్మం, 26 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
స్కూటీపై వెళ్తున్న ముళ్లపాటి పని అనే మహిళను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు సోమవారం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. సమాచారం అందుకున్న వైరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..