శంషాబాద్లో యువ కార్మికుడి అనుమానాస్పద మృతి
హైదరాబాద్లోని శంషాబాద్లో ఓ యువ కార్మికుడు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్గఢ్కు చెందిన కుందన్కుమార్ అనే యువకుడు గదిలో ఉరికి వేలాడుతున్న స్థితిలో కనిపించడం కలకలం రేపింది.
Unidentified dead body


హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని శంషాబాద్లో ఓ యువ కార్మికుడు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్గఢ్కు చెందిన కుందన్కుమార్ అనే యువకుడు గదిలో ఉరికి వేలాడుతున్న స్థితిలో కనిపించడం కలకలం రేపింది. అతడి మృతితో తోటి కార్మికులు ఆందోళనకు గురయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుందన్కుమార్ గత రెండేళ్లుగా శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. విమానాశ్రయ పరిసరాల్లోని ఓ గదిలో ఉంటున్న అతడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గదిలో ఉరేసుకున్న స్థితిలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు.

కుందన్కుమార్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇది ఆత్మహత్యా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతుడి వ్యక్తిగత పరిస్థితులు, ఇతర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయితేనే యువకుడి మృతికి సంబంధించిన అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande