గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం ఈనెల 6 వరకు దరఖాస్తు స్వీకరణ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందాలనుకునే అర్హులైన పట్టభద్రులు ఈనెల 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి సూచించారు.
NOMINATION


హైదరాబాద్ , 03 నవంబర్ (హి.స.)

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందాలనుకునే అర్హులైన పట్టభద్రులు ఈనెల 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తుల విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను ఎన్నికల అధికారులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 25వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు సీఈవో వెల్లడించారు. జాబితాలో పేర్లు, ఇతర వివరాలపై ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సరిచేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాలు, అభ్యర్థనలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించిన అనంతరం డిసెంబర్ 10న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. కాబట్టి అర్హులైన పట్టభద్రులు గడువులోగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ముసాయిదా జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ ప్రక్రియ కీలకం కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande