కడప కార్పొరేషన్లో కూటమి అభ్యర్థికి పోస్టల్ ఓట్ల ఆధిక్యం
కడప నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఓట్లలో కూటమి అభ్యర్థి సువర్ణ తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు.
Vote


కడప , 03 నవంబర్ (హి.స.)

కడప నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఓట్లలో కూటమి అభ్యర్థి సువర్ణ తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. మొత్తం 436 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదుకాగా, వాటిలో కూటమి అభ్యర్థి సువర్ణకు 208 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి దీప్తికి 102 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సువర్ణ 106 ఓట్ల మెజార్టీతో ముందంజలో నిలిచారు.

ఇక ఇతర అభ్యర్థులకు కలిపి 116 ఓట్లు వచ్చినట్లు లెక్కింపులో వెల్లడైంది. అలాగే ఐదు ఓట్లు చెల్లనివిగా గుర్తించగా, మరో ఐదు ఓట్లు నోటాకు పోలయ్యాయి. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థికి అనుకూల ఫలితం రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం సాధారణ ఓట్ల లెక్కింపుపైనా అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు దృష్టి సారించారు. పోస్టల్ బ్యాలెట్లో లభించిన ఆధిక్యం తుది ఫలితంలోనూ కొనసాగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. కడప కార్పొరేషన్లో ఎవరు విజయం సాధిస్తారన్నది తుది రౌండ్ల ఫలితాలతో స్పష్టత రానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande