వరస తుఫాండ్లతో దెబ్బతిన్న ఏపీ: సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
వరస తుఫాండ్లతో దెబ్బతిన్న ఏపీ: సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
AMITH SHAH


అమరావతి, 03 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా

సంభవిస్తున్న తుఫాన్ల తీవ్రత,వాటి వల్ల వాటిల్లిన ఆస్తి,పంట నష్టాలు మరియు ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఫోన్

చేసి మాట్లాడారు.రాష్ట్రంలో కొన్ని రోజుల

వ్యవధిలోనే మొదట 'అర్నబ్' తుఫాను,ఆ వెంటనే 'మురసు' తుఫాను విరుచుకుపడటంతో తీర

ప్రాంత జిల్లాలతో పాటు కోస్తాంధ్ర,రాయలసీమ

వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లిందని అమిత్ షాకు సీఎం చంద్రబాబు సమగ్రంగా

వివరించారు.

ఫోన్ సంభాషణలో భాగంగా,వ్యవసాయం,ఉద్యానవన పంటలు నీటమునిగిపోవడంతో పాటు రహదారులు,విద్యుత్ స్తంభాలు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు

ఎదుర్కొంటున్నారని సీఎం పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం

అప్రమత్తంగా వ్యవహరించి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు ప్రాణనష్టం

జరగకుండా తీసుకున్న ముందస్తు చర్యలను కేంద్రమంత్రికి తెలియజేశారు.ఇప్పటికే సంభవించిన

నష్టాన్ని స్వయంగా అంచనా వేసేందుకు కేంద్ర పరిశీలన బృందాన్ని ఏపీకి పంపినందుకు

గానూ అమిత్ షాకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.వరుస తుఫాన్ల ధాటికి

రాష్ట్రం ఆర్థికంగా,మౌలిక వసతుల పరంగా తీవ్రంగా

నష్టపోయినందున,ఉదారంగా స్పందించి తక్షణ

ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రిని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande