'మురసు' తుఫాను వేళ అప్రమత్తం: విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'మురసు' తుఫాను వేళ అప్రమత్తం: విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
murusu


అమరావతి, 03 నవంబర్ (హి.స.)

తీవ్ర తుఫాను 'మురసు' రాష్ట్ర తీరాన్ని

వణికిస్తున్న నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ మరియు అత్యవసర సేవలపై ఇంధన శాఖ మంత్రి

గొట్టిపాటి రవికుమార్ అధికారులతో ఉన్నత స్థాయి టెలీకాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు.తుఫాను ప్రభావం ఏపీఎస్‌పీడీసీఎల్

(APSPDCL)

పరిధిలోనే

అధికంగా ఉంటుందని అంచనా వేసినందున దక్షిణ కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అధికారులు మరియు సిబ్బంది

పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

అత్యవసర సేవలైన ఆసుపత్రులు,తాగునీటి సరఫరా కేంద్రాలు,కంట్రోల్ రూమ్‌ల వద్ద ఎటువంటి అంతరాయం కలగకుండా జనరేటర్లు

మరియు విద్యుత్ బ్యాకప్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.ప్రతి డివిజన్ స్థాయిలో

ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తేవాలని మరియు స్థానిక ప్రజలకు తక్షణ

సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 సేవలను సిద్ధం చేయాలని సూచించారు.తుఫాను తీవ్రత తగ్గి

ఈదురుగాలులు తగ్గగానే సిబ్బంది వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి తెగిపడిన

విద్యుత్ తీగలు,విరిగిన స్తంభాలను తొలగించి

పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన

సహాయక సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని,తెలంగాణ

మరియు తమిళనాడు నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బందికి నాణ్యమైన ఆహారం,వసతి సౌకర్యాలు కల్పించడంలో ఎలాంటి లోటుపాట్లు రాకూడదని

అధికారులను గట్టిగా ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande