ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం: 'మురసు' తుఫాను ప్రభావంతో పలు చోట్ల వాయిదా
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం: 'మురసు' తుఫాను ప్రభావంతో పలు చోట్ల వాయిదా
రీపోలింగ్


అమరావతి, 03 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్

వ్యాప్తంగా స్థానిక సంస్థలు మరియు మున్సిపల్ పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు

ప్రక్రియ ఈరోజు (నవంబర్ 3, 2026) ఉదయం 8 గంటలకు కట్టుదిట్టమైన భద్రత

నడుమ ప్రారంభమైంది.నిన్న రాత్రి వరకు జరిగిన

పోలింగ్ ముగిసిన అనంతరం అధికారులు బ్యాకెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి,రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో కౌంటింగ్‌ను చేపట్టారు.రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల

లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ

బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే,రాష్ట్ర తీరాన్ని వణికిస్తున్న 'మురసు' (Cyclone

Murasu) తీవ్ర

తుఫాను ధాటికి పలు కోస్తా జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు తీవ్ర విఘాతం

కలిగింది.ప్రకాశం,నెల్లూరు,బాపట్ల మరియు కృష్ణా

జిల్లాల్లో కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాలు,ఈదురుగాలుల కారణంగా కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోవడం,విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో లెక్కింపును

అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు.తీవ్ర వర్షాల ప్రభావం ఉన్న

లోతట్టు ప్రాంతాలు మరియు తుఫాను ప్రభావిత కేంద్రాల్లో పరిస్థితి సాధారణ స్థితికి

వచ్చాకే కౌంటింగ్ ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశాలు జారీ చేసింది.తుఫాను ముప్పు తక్కువగా

ఉన్న జిల్లాల్లో లెక్కింపు కొనసాగుతుండగా,ఫలితాలు

మధ్యాహ్నం నాటికి వెలువడే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande