
అమరావతి, 03 నవంబర్ (హి.స.)
తీవ్ర
తుఫాను'మురసు' (Cyclone Murasu) ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తీవ్రంగా
వణికిస్తోంది.నవంబర్ 3 తెల్లవారుజామున
ఒంగోలు సమీపంలో ఈ తుఫాను తీరాన్ని దాటడం ప్రారంభించింది.తీరం దాటే సమయంలో గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో
పాటు ప్రకాశం, నెల్లూరు,
బాపట్ల, గుంటూరు, కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో
భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు,
విద్యుత్ స్తంభాలు
నేలకూలాయి.ఒంగోలు
కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఆంధ్రకేసరి తంగూటూరి ప్రకాశం పంతులు విగ్రహంపై భారీ వృక్షం
కూలిపోవడంతో విగ్రహం దెబ్బతింది.
పరిస్థితి
తీవ్రతను గమనించిన రాష్ట్ర యంత్రాంగం ముందస్తుగా సహాయక చర్యలను వేగవంతం చేసింది.లోతట్టు
ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.బాధితులకు తక్షణ సాయం మరియు ఫిర్యాదుల
పరిష్కారం కోసం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ప్రత్యేకంగా'మన మిత్ర' (Mana Mitra)వాట్సాప్ హెల్ప్‌లైన్ (9552300009)
సేవలను అందుబాటులోకి
తెచ్చింది.విద్యుత్
సరఫరా పునరుద్ధరణ, చెట్ల
తొలగింపు వంటి అత్యవసర పనులను ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు యుద్ధప్రాతిపదికన
చేపడుతున్నాయి.తుఫాను ప్రభావంతో విశాఖపట్నం, విజయవాడ మార్గాల్లో నడిచే పలు రైళ్ల
రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ప్రమాదకరమైన
పరిస్థితులు ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన
హెచ్చరికలు జారీ చేశారు.మధ్యాహ్నం నాటికి ఈ తుఫాను తీవ్రత
క్రమంగా తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi