మురసు’ తుఫాను ధాటికి కోస్తాంధ్ర జలమయం: ప్రకాశం, బాపట్లలో రికార్డు స్థాయి వర్షపాతం
మురసు’ తుఫాను ధాటికి కోస్తాంధ్ర జలమయం: ప్రకాశం, బాపట్లలో రికార్డు స్థాయి వర్షపాతం
murusu


ప్రకాశం, 03 నవంబర్ (హి.స.)

తీవ్ర తుఫాను ‘మురసు’ పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం 8.30 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ప్రకాశం, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

అత్యధికంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో 19.80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, కొత్తపట్నంలో 18.22 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే బాపట్లలో 12.85 సెం.మీ., చీరాలలో 12.41 సెం.మీ., ప్రకాశం జిల్లా త్రోవగుంటలో 11.69 సెం.మీ., ఒంగోలు అర్బన్ ప్రాంతంలో 10.69 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

దీనితో పాటు చిలకపాడులో 10.45 సెం.మీ., సంతనూతలపాడులో 9.87 సెం.మీ., పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 9.6 సెం.మీ. మరియు మలికిపురంలో 9.37 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయినట్లు అధికారులు స్పష్టం చేశారు. పలుచోట్ల పంట పొలాలు నీటమునిగి చెరువులను తలపిస్తుండగా, వర్షం ధాటికి రహదారులపై నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande