పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: వైఎస్సార్సీపీకి బిగ్ షాక్
పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: వైఎస్సార్సీపీకి బిగ్ షాక్
ap high


పులివెందుల, 03 నవంబర్ (హి.స.)

వైఎస్సార్‌సీపీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో తీవ్ర అక్రమాలు, బూత్ క్యాప్చరింగ్ జరిగాయని, అందువల్ల ఓట్ల లెక్కింపును నిలిపివేసి రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును యథాతథంగా కొనసాగించేందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నవంబర్ 1న జరిగిన పోలింగ్ సందర్భంగా పులివెందులలో వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారని, తమ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి రీపోలింగ్ పెట్టేంత వరకు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని వైఎస్సార్‌సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటింగ్ నిలిపివేతకు నిరాకరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) షెడ్యూల్ ప్రకారమే లెక్కింపు పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో పులివెందులలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుండగా, కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande