ఓ ఆర్ ఆర్ పై టిప్పర్ను ఢీ కొట్టిన ఆటో.. ముగ్గురు మృతి
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Accident


హైదరాబాద్, 08 నవంబర్ (హి.స.)

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని

హిమాయత్ సాగర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

శంషాబాద్ నుండి మొయినాబాద్ వెళ్తున్న ఆటో, టిప్పర్ ను వెనక నుండి ఢీకొనడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పది మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

వీరంతా ఉపాధి కూలీలుగా సమాచారం. ముచ్చింతల్లో చెట్లు నాటే పనులు ముగించుకుని, ఒకే ఆటోలో దాదాపు 23 మంది వరకు కార్మికులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande