ఏపీలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,354 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Vote


అమరావతి , 08 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,354 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లను ఈ నెలలో విడతలవారీగా విడుదల చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడనుంది. ఈ విడతకు నామినేషన్లు దాఖలు చేసేందుకు 17వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. అనంతరం ఈ నెల 26న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.

రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ విడతలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా నామినేషన్లు సమర్పించాలి. రెండో విడత పోలింగ్ ఈ నెల 29న జరగనుంది.

ఇక మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ విడత నామినేషన్ల స్వీకరణకు 23వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్తో పాటు ఫలితాలు వెల్లడించనున్నారు.

మూడు విడతల్లో ఎన్నికలు పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి త్వరలో మొదలుకానుంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల్లోనూ ఎన్నికల షెడ్యూల్పై ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande