అద్వానీ, సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu Naidu(file)


అమరావతి , 08 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ప్రత్యేకంగా సందేశాలు పంపిస్తూ వారి ఆయురారోగ్యాలు, సంతోషకరమైన జీవితాన్ని ఆకాంక్షించారు.

ముందుగా అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు.. భారతదేశ అభివృద్ధి, రాజకీయ ప్రస్థతిలో ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. దేశ నిర్మాణంలో అద్వానీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిలో ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అలాంటి గొప్ప నాయకుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో అదృష్టమని అభిప్రాయపడ్డారు. అద్వానీ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా మరెన్నో సంవత్సరాలు జీవించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, ప్రజా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. ఇద్దరు ప్రముఖ నాయకులకు ఒకేరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు చేసిన సందేశాలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande