మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి చేరుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల ఆశీస్సులు, ఆదరణ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy


హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)

మహిళల ఆశీస్సులు, ఆదరణ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తాను ఆశించిన దానికంటే ఎక్కువగానే మహిళలు తనకు అందించారని, వారి మద్దతు తన రాజకీయ ప్రస్థానంలో ఎంతో కీలకమైందని వెల్లడించారు.

తనకు ఇకపై కొత్తగా ఏ పదవులూ అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి, వారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తన జీవిత ఆశయమని ప్రకటించారు.

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం ద్వారా వారి కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. మహిళల అభ్యున్నతికి కృషి చేయడమే తనకు అత్యంత సంతృప్తినిచ్చే విషయమని సీఎం పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande