
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సామాన్య కుటుంబంతో కలిసి దీపావళి పండుగను జరుపుకోనున్నారు. కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పర్సాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు బూరుపల్లి శ్రీనివాస్, సుమిత్ర దంపతుల నివాసానికి సీఎం వెళ్లనున్నారు. వారి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొంటారు.
ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇంట్లో పండుగను జరుపుకుంటున్న లబ్ధిదారుల కుటుంబంతో ముఖ్యమంత్రి ఆనందాన్ని పంచుకోనున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి వారితో పండుగ జరుపుకోవడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. సీఎం పర్యటన నేపథ్యంలో పర్సాపూర్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి రాక కోసం స్థానికులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్