హకీంపేటలో మహిళా సంఘాలతో సీఎం రేవంత్రెడ్డి భేటీ.. లగచర్లలో పామాయిల్ పరిశ్రమకు శంకుస్థాపన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు హకీంపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు హకీంపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై చర్చించనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు చేపడుతున్న కార్యక్రమాలపై కూడా సీఎం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

హకీంపేట పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాల భవనంతో పాటు కళాశాల భవనాలను ప్రారంభించనున్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

అనంతరం లగచర్లలో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ పరిశ్రమకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande