బొమ్రాస్పేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో విద్య, వైద్య, పోలీసు శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత బొమ్రాస్పేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన నూతన పోలీస్స్టేషన్ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆ తర్వాత హకీంపేటకు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి అక్కడ పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. హకీంపేటలో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాల భవనంతో పాటు కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) కూడా ప్రారంభించారు.

ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా వరుసగా ప్రభుత్వ భవనాలు ప్రారంభం కావడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు, ప్రజలకు వైద్య సేవలు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు మౌలిక వసతులు అందుబాటులోకి రావడం ఈ కార్యక్రమాల్లో ప్రధాన అంశంగా నిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande