
హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)
హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదించిన మెట్రో రైల్ రెండో దశ (ఫేజ్-2) ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తూ రూ. 275 కోట్ల నిధులను మంజూరు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫేజ్-2 పనుల ప్రాథమిక వ్యయాల కోసం రూ. 150 కోట్లను విడుదల చేయగా, ప్రాజెక్టు రుణాల చెల్లింపులు మరియు విస్తరణ సర్వేల కోసం మిగిలిన నిధులను కేటాయించారు. మున్సిపల్ శాఖ ఈ నిధుల వినియోగానికి సంబంధించిన అధికారిక జీవోను జారీ చేసింది.
రెండో దశలో నాగోల్ - శంషాబాద్ ఎయిర్పోర్టు, రాయదుర్గ్ - కోకాపేట్, ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట (పాతబస్తీ), మియాపూర్ - పటాన్చెరు మరియు ఎల్బీనగర్ - హయత్నగర్ కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ మార్గాలను చేర్చారు. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్ల రూపకల్పన ప్రక్రియ సాగుతోంది. ఈ నిధుల విడుదల ద్వారా క్షేత్రస్థాయిలో భూసేకరణ, డీపీఆర్ (DPR) మార్పులు మరియు సాంకేతిక సర్వేలు మరింత వేగవంతం కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్