రాష్ట్రవ్యాప్తంగా నేడు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ సంబరాలు జరుపుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉంది.
Telangana govt


హైదరాబాద్ , 08 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ సంబరాలు జరుపుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని లబ్ధిదారులతో పండుగ ఆనందాన్ని పంచుకోనున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల వద్ద ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొని లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు. కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టిన కుటుంబాలకు పండుగ మరింత ప్రత్యేకంగా మారేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇళ్ల వద్ద దీపాలు వెలిగించడం, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులతో కలిసి దీపావళి జరుపుకోవడం ద్వారా వారిలో ఆనందాన్ని నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande