దీపావళి వేళ ప్రజలకు నారా లోకేశ్ శుభాకాంక్షలు
వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు తీసుకురావాలని ఆయన ఆకాం
Lokesh


అమరావతి , 08 నవంబర్ (హి.స.)

వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీదేవిని ప్రార్థించిన లోకేశ్.. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నారు. ప్రజలు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధించాలని, వారి ఆశయాలు నెరవేరాలని అభిలషించారు. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడాలని పేర్కొన్నారు.

దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని లోకేశ్ సూచించారు. అదే సమయంలో పండుగ వేడుకల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆకాంక్షించారు. దీపాల వెలుగుల మాదిరిగానే ప్రజల జీవితాల్లో సంతోషం, ఆశావహ దృక్పథం నిండాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande