కొత్త పింఛన్దారులకు శుభవార్త
దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు ఇవ్వబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం తన సొంత నియోజకవర్గం కోడంగల్ నుంచి ఈ పంపిణీని మొదలుపెట్టనున్నారు.
Good news


హైదరాబాద్, 08 నవంబర్ (హి.స.)

దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు ఇవ్వబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం తన సొంత నియోజకవర్గం కోడంగల్ నుంచి ఈ పంపిణీని మొదలుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా హాజరుకానున్నారు.

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులు వంటి పలు వర్గాల్లో అర్హత ఉన్న వారిని ఈసారి ఎంపిక చేశారు. కోడంగల్ లో జరిగే సభలో ముఖ్యమంత్రి కొంతమంది కొత్త లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలు అందజేస్తారు.

ఆ తర్వాత అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ద్వారా మిగిలిన వారందరికీ పత్రాలు పంపిణీ చేస్తారు. కొత్తగా ఎంపికైన వారందరికీ ఈ నెల నుంచే పింఛన్ డబ్బులు అందనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande