
నిర్మల్, 08 నవంబర్ (హి.స.)
దీపావళి పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలందరికీ మనసారా శుభాకాంక్షలు చెప్పారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా నిలిచే పండుగే దీపావళి అని ఆయన అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, సంతోషాలు, మంచి ఆలోచనలు తీసుకురావాలని కోరుకున్నారు.
సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని, కుటుంబాల్లో సుఖశాంతులు ఉండాలని ఆకాంక్షించారు. పండుగను సంతోషంగా జరుపుకుంటూనే పర్యావరణాన్ని కాపాడుకోవాలని, బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధిని ఇవ్వాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..